సినిమా

Nivetha Pethuraj: నివేథా పేతురాజ్ పెళ్లి క్యాన్సిల్?

Nivetha Pethuraj: తమిళ, తెలుగు సినీరంగంలో మెరిసిన నటి నివేథా పేతురాజ్ వ్యక్తిగత జీవితంలో షాకింగ్ మలుపు ఎదుర్కొంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజీత్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది పెళ్లి ఖరారైంది. కానీ ఇప్పుడు ఇద్దరూ విడిపోయినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

నివేథా పేతురాజ్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజీత్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే ఏడాది గ్రాండ్‌గా పెళ్లి జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఫొటోలు పోస్ట్ చేస్తూ ప్రేమను బహిరంగంగా చాటుకున్నారు.

కానీ గత కొన్ని రోజులుగా నివేథా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాజీత్‌తో ఉన్న అన్ని ఫొటోలూ డిలీట్ చేసినట్టు గమనించారు. రాజీత్ కూడా అదే పని చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. దీంతో వీరి మధ్య బ్రేకప్ జరిగినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇద్దరూ ఈ విషయంపై ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button