కల్పిక రచ్చ.. మొన్న పబ్.. ఇప్పుడు రిసార్ట్!

Kalpika: సినీ నటి కల్పిక మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఆమె సృష్టించిన గందరగోళం సంచలనంగా మారింది. రిసార్ట్ సిబ్బందితో ఆమె ప్రవర్తనపై ఆరోపణలు వచ్చాయి. కల్పిక ఏమని సమాధానమిచ్చారో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని మొయినాబాద్ సమీపంలోని బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో నటి కల్పిక సృష్టించిన రచ్చ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు చేరుకున్న కల్పిక, రిసెప్షన్‌లో మేనేజర్‌తో దురుసుగా మాట్లాడారు. మెనూ కార్డును విసిరేసి, రూమ్ కీలను మేనేజర్‌పై విసరడంతో సిబ్బంది షాకయ్యారు. సిగరెట్లు అడిగిన కల్పిక, సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 40 నిమిషాల పాటు ఆమె హంగామాతో ఇతర అతిథులు అసౌకర్యానికి గురయ్యారు.
దీనిపై కల్పిక స్పందిస్తూ, “సిబ్బంది నన్ను అనవసరంగా టార్గెట్ చేశారు. వైఫై, క్యాబ్ సౌకర్యాలు లేకపోవడంతో నేను బాధపడ్డాను. పోలీసుల వేధింపుల కారణంగా మనశ్శాంతి కోసం రిసార్ట్‌కు వచ్చాను. నా ఉద్దేశం ఎవరినీ ఇబ్బంది పెట్టడం కాదు” అని వివరణ ఇచ్చారు. రిసార్ట్ సిబ్బంది ఇంకా అధికారికంగా స్పందించలేదు.