సినిమా
Rajendra Prasad: షాకులు మీద షాకులిస్తున్న రాజేంద్రప్రసాద్ !

Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ‘స:కుటుంబానాం’ ఈవెంట్‌లో బ్రహ్మానందం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చర్చనీయంశంగా మారారు.
‘స:కుటుంబానాం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటులు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత మైక్ రాజేంద్రప్రసాద్‌కు అందించారు. ఆ సమయంలో బ్రహ్మానందంపై రాజేంద్రప్రసాద్ అనుచిత పదం వాడారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో రాజేంద్రప్రసాద్ వివాదాస్పదమయ్యారు. ఇలా షాకులు మీద షాకులిస్తున్నారు రాజేంద్రప్రసాద్.



