సినిమా

కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా విడుదలైన జిగ్రీస్ ఫస్ట్ సింగిల్

Jigris: ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన జిగ్రీస్ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ టీజర్ 2 మిలియన్ వ్యూస్ దాటింది. దీంతో సినిమా యూత్‌లో మంచి హైప్ సృష్టించుకుంది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట “తిరిగే భూమి”ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశారు. పాట విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“ఈ పాట చాలా ఎనర్జీటిక్‌గా ఉంది. కమ్రాన్ సయ్యద్ ఇచ్చిన ట్యూన్ ఫ్రెష్‌గా ఉంది, లిరిక్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. టీజర్‌నే ముందే చూసి బాగా నచ్చింది. నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే, అందుకే కొత్త వాళ్లకు ఎప్పుడూ ప్రత్యేక ఇష్టం ఉంటుంది. జిగ్రీస్ టీమ్ ఎంతో ప్యాషన్‌తో పనిచేసింది. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్ముతున్నా” అని అన్నారు.

ఈ పాటను T-Series మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే టీజర్‌తో క్రేజ్ సంపాదించిన ఈ చిత్రం, పాటతో మరింతగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

జిగ్రీస్ సినిమాలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా, మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button