నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో విలనిజం, కామెడీ పండించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల పూర్తిగా క్షీణించడంతో అభిమానులు, సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పైచికిత్స పొందుతున్నారు.
నాలుగేళ్లు క్రితం రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ఫిష్ వెంకట్ కిడ్నీలు మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి సరైన వైద్య సేవలు పొందలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాతలు సాయం చేసి ఫిష్ వెంకట్‌ను కాపాడాలని కూతురు స్రవంతి కోరారు.