తెలంగాణ
Khammam: ప్రేమించడం లేదని యువతిపై యాసిడ్ దాడి

Khammam: ఖమ్మంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14వ తేదీన రాత్రి ఇంటి ముందు ముగ్గు వేస్తున్న యువతిపై యాసిడ్ పోశాడు ఉన్మాది. దీంతో.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.