ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు

గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఐపీవో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. పరిశ్రమల శాఖలో ఐపీవోగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్ చేశాడు. బాధితుడు కమలాకర్ తొలుత 30వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఏసీబీ అధికారులు శ్రీనివాస్‌రావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.



