ఆంధ్ర ప్రదేశ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3 వరకు పొడిగించింది న్యాయస్థానం రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలిస్తున్నారు.
అధికారులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా 9 మంది నిందితులను విజ యవాడ జిల్లా జైలుకు, మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు తరలించారు అధికారులు లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి.



