Abhishek Bachchan: కూతురు పెంపకంపై అభిషేక్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు!

Abhishek Bachchan: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన కూతురు ఆరాధ్య పెంపకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఐశ్వర్య రాయ్ పాత్ర గురించి ఆసక్తికర వివరాలు చెప్పారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరాధ్య సోషల్ మీడియా ఖాతాలు లేకుండా, ఫోన్ కూడా ఉపయోగించకుండా సాధారణ జీవనశైలిలో ఉంటుందని వెల్లడించారు. ఆరాధ్య పెంపకంలో ఐశ్వర్య రాయ్ పూర్తి బాధ్యత వహిస్తున్నారని, ఆమె కృషిని అభిషేక్ గొప్పగా కొనియాడారు.
తన సినిమా కెరీర్ కోసం బయట తిరిగే స్వేచ్ఛ తనకు ఉందని, కానీ ఆరాధ్య బాగోగులను ఐశ్వర్య ఒక్కరే చూసుకుంటారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐశ్వర్య నిబడ్డ గృహిణిగా, తల్లిగా తన విధులను నిర్వహిస్తూ, ఆరాధ్యను సమాజంలోని డిజిటల్ ప్రభావాల నుంచి దూరంగా ఉంచుతున్నారని అభిషేక్ పేర్కొన్నారు. ఈ విషయం ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తిని రేకెత్తించింది.