Coolie: ‘కూలీ’ నుంచి ఆమిర్ లుక్ రిలీజ్.. బాలీవుడ్ లో మిన్నంటిన అంచనాలు!

Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజా అప్డేట్‌తో సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది.
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అమీర్ ఖాన్ ‘దహా’ అనే స్టైలిష్ పాత్రలో నటిస్తున్నారు. షర్ట్‌లెస్ లుక్‌లో, సిగార్‌తో అమీర్ లుక్ సినిమాపై బజ్‌ను పెంచింది.
ఈ పాత్ర రోలెక్స్ తరహాలో ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో కూడా బజ్ పెరిగింది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ వంటి స్టార్ కాస్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అమీర్ ఖాన్ పాత్రకు సంబంధించిన తాజా పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.