సినిమా
Aadi Srinivas: రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

Aadi Srinivas: రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, భారత ప్రధానమంత్రిగా సమర్థవంతంగా పనిచేసే నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టారన్నారు. గ్రామపంచాయితీలకు నేరుగా ఢిల్లీ నుంచి నిధులు వచ్చేలా చేశారన్నారు. ప్రపంచానికి యువత వెన్నుముకని ఆనాడే గుర్తించి యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించినట్లు గుర్తుచేశారు.



