తెలంగాణ
Aadi Srinivas: బీసీలకు బీజేపీ మోసం చేస్తే కాంగ్రెస్ న్యాయం చేస్తుంది

Aadi Srinivas: బీజేపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక సాధించుకుంటామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బిల్లు ఆమోదంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కాంగ్రెస్ సర్కార్‌కు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోనే సామాజిక న్యాయం ఉంటుందని, బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమిస్తారా అని ఎమ్మెల్యే ఆది ఎంపీ రఘునందన్‌కు సవాల్ విసిరారు.