AA22’ రిలీజ్ డేట్ ఫిక్స్?

AA22: అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న ‘AA22’ సినిమా హైప్‌ను పెంచేస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ అప్డేట్ వైరల్ అవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ‘AA22’ అభిమానుల్లో జోష్ నింపుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, హాలీవుడ్ టెక్నీషియన్లతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్-వరల్డ్ చిత్రం 2027 పొంగల్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. సీజీ వర్క్‌ల కోసం ఏడాది పొడవునా షెడ్యూల్ సిద్ధం.
ఆరు నెలల్లో ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. అల్లు అర్జున్ కొత్త లుక్ కోసం ఇంటెన్స్ ట్రైనింగ్‌లో ఉన్నారు. డ్యూయల్ రోల్‌లో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. అట్లీ కెరీర్‌లో ఆరో చిత్రంగా, విజువల్ ట్రీట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. బన్నీ-అట్లీ కాంబో అంచనాలను మించి సంచలనం సృష్టించనుంది.