తెలంగాణ
బెట్టింగ్ భూతానికి బలైన మరో యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. తంగళ్ళపల్లి మండలం దేశాయ్‌పల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ ఇంటర్ పూర్తి చేసి మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. అయితే మూడేళ్లుగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు.
ఈ క్రమంలోనే సుమారు పది లక్షల రూపాయలు పోగొట్టకున్నాడు. అప్పులు పూడ్చడానికి స్నేహితులు, సన్నిహుతల వద్ద అప్పు చేశాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి అతడిని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు తన పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.