తెలంగాణ
Khilashapur: నడిరోడ్డుపై శిశువును వదలిన తల్లి

Khilashapur: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై శిశువును వదలి వెళ్లింది తల్లి. అయితే ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో నిద్రలేచి రోడ్డుపై ఉన్న శిశువును చూశారు స్థానికులు. అనంతరం శిశువుకు స్నానం చేయించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో పోలీ సులు దర్యాప్తు చేపట్టారు.