ఆంధ్ర ప్రదేశ్
ఇంటిపై కూలిన భారీ వృక్షం

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మొగల్తూరు నక్కవానిపాలెంలోని ఓ ఇంటిపై భారీ వృక్షం కూలిపోయింది. అయితే చెట్టు ఇంటిపై పడడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కానీ ఇంటికీ అడ్డంగా చెట్టు పడి ఉండడంతో బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో పిల్లలతో ఇంట్లోనే చిక్కుకున్నారు ఆ ఇంటి వాసులు. అధికారులకు ఫోన్ చేసిన స్పందించడం లేదని వెంటనే చెట్టును తొలగించాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.



