తెలంగాణ
కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉస్మాన్ బాగ్లోని ఫుట్ వేర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికిక చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



