తెలంగాణ
ఎర్రమంజిల్ పెట్రోల్ బంకులో కారులో మంటలు

పంజాగుట్టలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన పెట్రోల్ పంపు సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు.
పెట్రోల్ పంపులో ఉన్న కార్లో మంటలు రావడంతో సిబ్బంది, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను అర్పిన వెంటనే కార్‌ను పెట్రోల్ పంపు నుండి సిబ్బంది బయటికి తీసుకెళ్లారు.



