తెలంగాణ
హోంగార్డును ఢీకొట్టి కారు.. డ్రైవర్ పరార్

హైదరాబాద్ మాదాపూర్‌లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. పర్వత్ నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డు నయీంను కారుతో ఢీకొట్టి పరారైయ్యాడు నిందితుడు. గాయాలపాలైన హోమ్ గార్డును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్న హోమ్ గార్డును ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, అడిషనల్ డీసీపీ హనుమంత్ రావు పరామర్శించారు.



