Medchal: అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం.. నలుగురికి గాయాలు

Medchal: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మాణం కొనసాగుతున్న ఒక భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అత్యవసర చికిత్స కోసం సమీప హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు బయటకు వచ్చేలోపే యూనివర్సిటీ యాజమాన్యం, హాస్పిటల్ సిబ్బంది మీడియాను నిలువరించేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులను యూనివర్సిటీ క్యాంపస్‌కి లోపలికి అనుమతించలేదు.