Jack OTT: ఓటీటీలోకి సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’!

Jack OTT: సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘జాక్’ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రెడీ అవుతున్న ఈ సినిమా గురించి వివరాలు చూద్దాం.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ‘జాక్’ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సిద్ధూ జొన్నలగడ్డ తన మార్క్ కామెడీ టైమింగ్, కాన్ఫిడెంట్ పెర్ఫార్మన్స్తో ఆకట్టుకున్నాడు. వైష్ణవి చైతన్య కూడా తన పాత్రలో ఆకర్షణీయంగా కనిపించింది. ఇద్దరి మధ్య సన్నివేశాలు ఫన్, ఎంటర్టైన్మెంట్తో సాగాయి. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు ఓటీటీలో ‘జాక్’ను ఎలా ఆదరిస్తారు? సిద్ధూ మ్యాజిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఏ రేంజ్లో హిట్ అవుతుందో చూడాలి.