తెలంగాణ
Eatala Rajendar: ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు

Eatala Rajendar: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైరయ్యారు. రేవంత్‌కు పాలన చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని సీఎం రేవంత్ రెడ్డి అనడం సరికాదని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని తెలియజేశారు. 2014 లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం 29 వేల కోట్లు అని తెలిపారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దు అన్నారు. ఇప్పటివరకు రేవంత్ సర్కార్ చేసిన అప్పు రూ. లక్షా 30 వేల కోట్లు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.