Hit 3: ‘హిట్ 3’ నాన్-థియేట్రికల్ రైట్స్ బిగ్ డీల్..

Hit 3: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘హిట్ 3’ సినిమా బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం నాన్-థియేట్రికల్ రైట్స్‌తోనే భారీ లాభాల టాక్ తెచ్చుకుంది.
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ 3’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే ప్రొడక్షన్ ఖర్చును రికవరీ చేసినట్టు ఇన్‌సైడ్ టాక్. థియేటర్స్ నుంచి వచ్చే ఆదాయం మొత్తం లాభంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమా కూడా ఇదే ఫార్ములాతో సక్సెస్ అయింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో నాని తన సత్తా చాటుతున్నాడు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం మరో ఆకర్షణగా నిలవనుంది. ‘హిట్’ సిరీస్‌లో మూడో చిత్రంగా రాబోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? వేచి చూడాలి.