ఆంధ్ర ప్రదేశ్
Kesineni Chinni: మోడీ సభను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలి

Kesineni Chinni: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్నా పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నాయకులంతా కలిసికట్టుగా సమిష్టి నాయకత్వంలో పనిచేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నాయకులంతా పనిచేయడం వల్లనే తాను 57 వేల మెజార్టీతో విజయం సాధించగలిగానని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ అమరావతికి 15వేల కోట్ల గ్రాంట్‌ను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మోడీ సభను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలన్నారు.