NTR-Devara 2: దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ రెడీ

NTR-Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇప్పుడు ‘దేవర పార్ట్-2’తో మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం!
‘దేవర’ బ్లాక్‌బస్టర్ తర్వాత, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త! ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. డైరెక్టర్ కొరటాల శివ ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విజువల్స్ కోసం విఎఫ్ఎక్స్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్న కొరటాల, కొత్త ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు.
నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అనిరుధ్ సంగీతం మరో హైలైట్‌గా నిలవనుంది. ‘దేవర పార్ట్-2’ మరో బాక్సాఫీస్ సంచలనంగా రూపొందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి, ఎన్టీఆర్ ఈ సీక్వెల్‌తో ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.