జాతియం
Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వరద హెచ్చరికలు

Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా ఇటీవల పహల్‌గామ్ ఉగ్రదాడిపై చర్యల్లో భాగంగా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నీటిమట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరించారు. అంతే కాదు స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు.