హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో MIM గెలుపు

Hyderabad: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో MIM గెలిచింది. 63 ఓట్లతో MIM అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ GHMC హెడ్ ఆఫీస్‌లో జరిగింది.
ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఎన్నికల బరిలో కేవలం బీజేపీ, ఎంఐఎం మాత్రమే నిలిచాయి. ఎన్నికల్లో గెలుపై ఎంఐఎం మొదటి నుండే ధీమాగా ఉంది. అనుకున్నట్లుగానే గెలిచింది. ఇక క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశే మిగిలింది. ఓటమి చెందింది.