తెలంగాణ
Revanth Reddy: జపాన్‌లో నేడు సీఎం రేవంత్ చివరిరోజు పర్యటన

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌లో ఇవాళ చివరి రోజు పర్యటించనున్నారు. చివరి రోజు పర్యటనలో భాగంగా రేవంత్ హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌తో సమావేశం కానున్నారు.
హిరోషిమా జపాన్, ఇండియా చాప్టర్‌తో బిజినెస్ లంచ్ చేయనున్నారు రేవంత్. అనంతరం హిరోషిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సందర్శించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు.