క్రీడలు

IPL 2025 : ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వర్సెస్ బెంగళూరు

IPL 2025: ఐపీఎల్‌లో ఈ రోజు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో ఒకసారి తలపడగా పంజాబ్ కింగ్స్ స్టన్నింగ్ విక్టరీని అందుకుంది. ఆర్సీబీని వాళ్ల హోం గ్రౌండ్‌లోనే ఓడించింది. ఈరోజు పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్ ముల్లాన్‌పూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇందులో పంజాబ్‌ను ఓడించి రివేంజ్ తీర్చుకోవాలని ఆర్సీబీ చూస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2025లో భాగంగా 37వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. న్యూ ఛండీఘడ్‌లోని ముల్లాన్‌పూర్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025లో హై ఓల్టేజ్ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఆర్సీబీ సొంతగడ్డపై ఆ జట్టును 95 పరుగులపై కట్టడి చేసి పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు కాళరాత్రి మిగిల్చిన పంజాబ్ ప్లేయర్లుమ్యాచ్ గెలిచిన తర్వాత ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌కి రివేంజ్ తీర్చుకునేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. పంజాబ్ హోం గ్రౌండ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం ఆర్సీబీతో బిగ్ ఫైట్ జరగనుంది.

పంజాబ్, ఆర్సీబీ రెండు జట్లు ఈ సీజన్‌లో ఒకసారి తలపడ్డాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయం పాలయింది. ఒకానొక దశలో 50 పరుగలలోపే ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ.. టిమ్ డేవిడ్ రాణించడంతో 95 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు పంజాబ్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నేహాల్ వధేరా స్పెషల్ ఇన్నింగ్స్‌తో 12.1 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 34 మ్యాచ్‌లు ఆడాయి. అందులో ఆర్సీబీ 16 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కేవలం మూడు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది.\

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button