సినిమా

మెగాస్టార్ ‘స్టాలిన్’ మళ్లీ థియేటర్లలో సందడి

Stalin: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త! సందేశాత్మక చిత్రం ‘స్టాలిన్’ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. రీ-రిలీజ్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. వివరాల్లోకి వెళ్తే…

2006లో దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ మాస్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి డైనమిక్ నటన, మణిశర్మ సంగీతంతో ఈ చిత్రం అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించింది. అప్పట్లో సామాన్యంగా ఆడినా, ఈ సినిమాకు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ‘స్టాలిన్’ రీ-రిలీజ్‌కు సన్నాహాలు జోరందుకున్నాయి.

పాత ప్రింట్‌ను రీమాస్టర్ చేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్‌లో థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నప్పటికీ, చిరంజీవి అభిమానులు ఆగస్ట్‌లో మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్‌ను ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ రీ-రిలీజ్‌పై ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ‘స్టాలిన్’ మళ్లీ ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తాడో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button