Hyderabad: పైశాచికం.. వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్స్

Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధు రాలిని హత్యచేసి యువకుడు పైశాచికం ఆనందం పొందాడు. మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ సెల్పీ వీడియో తీసుకున్నాడు. అంతేకాదు.. ఆ సెల్ఫీ వీడియోను స్నేహితులకు షేర్ చేశాడు ఆ యువకుడు. ఒంటరిగా ఉంటున్న కమలాదేవిని ఉరివేసి హత్య చేశా డు. అనంతరం మృతదేహంపై నిందితుడు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకున్నాడు.
కమలాదేవి ఇంట్లో రెంట్‌కు ఉంటున్నాడు కృష్ణపాల్ సింగ్. అయితే అద్దె విషయంలో మందలించినందుకు యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ నెల 11న కమలాదేవిని హత్య చేశాడు కృష్ణపాల్ సింగ్. ఇక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వృద్ధురాలి మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు రాజస్థాన్‌కి చెందిన నిందితుడు కృష్ణపాల్ సింగ్ కోసం గాలిస్తున్నారు. వృద్దురాలిని చంపేసిన కృష్ణపాల్ మైనర్ యువకుడని పోలీసులు అనుమానిస్తున్నారు.