సినిమా

Akhil 6: అఖిల్ 6 అప్ డేట్.. రేపే గ్లింప్స్

Akhil 6: అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన తాజా చిత్రంతో మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రేపు ఉదయం విడుదల కానుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో అఖిల్ కనిపించనుండటం ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది.

ఈ చిత్రం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో హై-ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం అఖిల్‌పై యాక్షన్ సీన్స్‌ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. టైటిల్‌గా ‘లెనిన్’ పెట్టబోతున్నట్లు సమాచారం. అందాల తార శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. చిత్తూరు యాసలో అఖిల్ మాడ్యులేషన్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమా హైలైట్‌గా నిలవనున్నాయి. రేపు విడుదలయ్యే టైటిల్ గ్లింప్స్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button