జాతియం
బెంగళూరులో దారుణం.. యువతులను వెంబడించి అసభ్యంగా తాకిన వ్యక్తి

Bengaluru: బెంగళూరులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యువతులను వెంబడించిన ఓ వ్యక్తి.. వారిని అసభ్యంగా తాకాడు. సీసీటీవీలో ఈ వేధింపుల దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఈ ఘ టనపై పోలీసులు ఫిర్యాదు అందలేదంటున్నారు. ఇక సీసీపుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.
బెంగళూరు ఘటనపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ స్పందించారు. అయితే ఇప్పుడు పరమేశ్వర వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఇలాంటి పెద్ద నగరంలో అక్కడక్కడా.. ఒకటీ అరా ఘటనలు జరుగుతుంటాయి అనడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు రాత్రి గస్తీ పెంచాలని కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర.