Donald Trump: ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన.. ప్రపంచ దేశాధినేతల స్పందన ఏంటంటే?

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. లిబరేషన్ డే పేరుతో పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించి వాణిజ్య యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏప్రిల్ 2 ప్రకటన కోసం యావత్తు ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూసింది. ఏ దేశంపై ఎంత మేర సుంకాలు వేస్తారోనని అంచనాలకు తెరదించుారు.
ఈ కొత్త సుంకాలు నేటి నుంచే అమలులోకి వస్తుందని తెలిపారు. తమపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగమే తాము విధిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 2 విడుదలపై ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతికార సుంకాలను ప్రకటించారు. అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కనీసం 10 శాతం సుంకంగా నిర్ణయించారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో కొన్నింటిపై అధిక సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. లిబరేషన్ డే పేరుతో ట్రంప్ ప్రకటించిన సుంకాల్లో అత్యధికంగా కంబోడియాపై 49 శాతం విధించారు.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయని భారత్, జపాన్, ఐరోపా సమాఖ్య, చైనాలపై ట్రంప్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం, జపాన్‌పై 20 శాతం, యూరోపియన్ యూనియన్ దేశాలంపై 20 శాతం పన్నులు వేస్తామని తెలిపారు.
ట్రంప్ ప్రతీకార సుంకాలపై పలు దేశాధినేతలు స్పందించారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బెన్సీ మాట్లాడుతూ అమెరికాకు తమ దేశం బీఫ్‌ను ఎగుమతి చేయడం కష్టమవుతుందని, అన్యాయమైన సుంకాలతో ధరలు పెరిగి అమెరికన్లపై అధిక భారం పడుతుందని చెప్పారు. ‘
‘ఈ అన్యాయమైన సుంకాలకు అతిపెద్ద మూల్యం చెల్లించేది అమెరికన్ ప్రజలే అందుకే మా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించాలని కోరుకోవడం లేదుదు. అధిక ధరలకు, వృద్ధిని నిరోధానికి దారితీసే స్థాయికి వెళ్లే పోటీలో మేము చేరం’’ అని ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టం చేశారు.