సినిమా

JAAT: అదిరిపోయిన 'జాట్' ఫస్ట్ సాంగ్

JAAT: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న తాజా చిత్రం ‘జాట్’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా నుంచి మొదటి సింగిల్‌ను విడుదల చేసింది.

‘టచ్ కియా’ అనే ఈ పాటకు సంగీత దర్శకుడు థమన్ తన విలక్షణమైన బీట్స్‌తో మాస్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా జోడించారని చెప్పాలి. ఈ సాంగ్‌లో బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా సందడి చేసింది. ఆమె గ్లామర్ ఈ పాటకు మరో ఆకర్షణగా నిలిచింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో అతని డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి.

అంతేకాకుండా, ఈ పాటలో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా, నటి రెజీనా కాసాండ్రా కూడా కనిపించడం గమనార్హం. అయితే, పాటలో మెయిన్ హీరో సన్నీ డియోల్ లేనట్టుగా అనిపిస్తోంది. మొత్తంగా ఈ పాట హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ‘జాట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button