తెలంగాణ
KCR: నేడు BRS నేతలతో కేసీఆర్ కీలక సమావేశం

KCR: కాసేపట్లో BRS నేతలతో ఆపార్టీ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నెల 10న ప్రతినిధుల సభ 27న బహిరంగ సభ ఏర్పాట్లపై సీనియర్ నేతలకి సలహాలు, సూచనలు చేయనున్నారు.
ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రిబుల్ షూటర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. అలాగే BRS రజతోత్సవ వేడుకలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపైనా చర్చించే అవకాశం కన్పిస్తోంది.