తెలంగాణ

బీజేపీ ఆఫీస్‌లో ప్రారంభమైన బేరర్స్ సమావేశం.. కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ

Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా.. బీజేపీ రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, రైతు సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలు , రాష్ట్రంలోని తాజా రాజకీయాల ఈ భేటీలో చర్చించనున్నారు.

అయితే ఈ మీటింగ్‌కు ఎంపీలు,ఎమ్మెల్యేలు, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. కాగా ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా సంస్థాగత వ్యవహారాలపై దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button