Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు..సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఇంకా జూబ్లీహిల్స్ పీఎస్‌లోనే ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రవణ్‌రావుకు ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో కొందరు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవంటూ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో నగదు స్వాధీనం వెనక అప్పటి టాస్క్‌ఫోర్స్‌ను అప్రమత్తం చేశారా అంటూ శ్రవణ్ రావుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరికరాలు విదేశాల నుంచి కొనుగోలు చేశారా..? ఒకవేళ కొనుగోలు చేస్తే ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరని క్వశ్చన్ చేసినట్లు తెలుస్తుంది.
SIB మాజీ dspప్రణీత్ రావు టీమ్స్ ఏర్పాటు వెనక పాత్రపై ఆరా.? తీస్తున్నారు. ఇక అసలు ప్రభుత్వంతో ప్రత్యక్ష ప్రమేయం లేనప్పుడు ఫోన్ ట్యాపింగ్‌లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు శ్రవణ్ రావును ప్రశ్నిస్తున్నారు పోలీసులు