ఆంధ్ర ప్రదేశ్
Akhila Priya: తెలుగు గంగ, కేసి కెనాల్ కింద ఆయకట్టు ఎక్కవ ఉంది

Akhila Priya: నంద్యాలలో తెలుగు గంగ, కేసీ కెనాల్ అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశమయ్యారు. ఆళ్ళగడ్డ ప్రాంతంలో తెలుగుగంగ, కేసీ కాల్వ కింద ఆయకట్టు ఎక్కువ ఉందన్నారు భూమా అఖిల ప్రియ.
కొన్ని ప్రాంతాల్లో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అఖిల ప్రియ తెలిపారు. అవగాహన లేనందున రైతులకు సరిగా నీరు అందలేదని వెల్లడించారామె. వచ్చే ఏడాది నుండి రైతులందరికీ ఒకే సమయంలో పంట వేసేలా.. పంటకు నీరందేలా ప్రయత్నం చేస్తామన్నారు భూమా అఖిల ప్రియ.