సినిమా

Robin Hood: నితిన్ రాబిన్‌హుడ్ సినిమాకు టికెట్ ధ‌ర‌ల పెంపు..

Robinhood: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో ‘రాబిన్‌హుడ్’ సినిమా టిక్కెట్ ధరలు పెరిగాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 చొప్పున ధరలు పెంచారు. ఈ నిర్ణయం వారం రోజుల పాటు అమలులో ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమాకు మంచి ఆదరణ ఉండటంతో థియేటర్ యాజమానులకు లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, సాధారణ ప్రేక్షకులకు ఈ ధరల పెంపు కొంత భారంగా మారొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50 అదనం అనేది కాస్త సర్దుకునేలా ఉన్నప్పటికీ, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెరగడం ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించొచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button