సినిమా
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సేనీ మార్చి 25న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా)తో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
షిహాన్ హుస్సేనీ పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చిన గురువు. పవన్ ఆయన వద్ద శిక్షణ తీసుకుని కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు.ఈ విషాద సంఘటనపై పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన మరణం తనను బాధించిందని, మార్షల్ ఆర్ట్స్‌లో తనకు శిక్షణ ఇచ్చిన గురువు గారి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. షిహాన్ హుస్సేనీ తన చివరి రోజుల్లో తన శిక్షణ కేంద్రాన్ని కాపాడాలని, మార్షల్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు కూడా తెలుస్తోంది.