ఆంధ్ర ప్రదేశ్
గుంటూరులో హై టెన్షన్.. యువకుడిపై పోలీసుల దాడి

గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. ఫిరంగిపురం శాంతి నగర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్లెలోని కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయంలో చిన్ని కృష్ణ అనే కుటుంబానికి గ్రామస్థులకు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఓ యువకుడు వీడియో తీస్తుండగా సీఐ రవీంద్ర బాబు తుపాకీతో దాడి చేశాడు. యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్థులు సీఐపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల కారుపై రాళ్లు వేసి ఆందోళన చేపట్టారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. సీఐ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు.