తెలంగాణ
KTR: నేటి నుంచి కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటన

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతోపాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఇవాళ కేటీఆర్ సూర్యాపేటకు బయల్దేరనున్నారు. ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ఏకంగా 10వేల మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ నెల 23న కరీంనగర్ గులాబీ శ్రేణులతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబురాల విజయవంతం కోసం క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.