తెలంగాణ
Kishan Reddy: శంషాబాద్ ఎయిర్ పోర్టు స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తీర్చిదిద్దుతున్నాం

Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను శంషాబాద్ విమానాశ్రయం స్థాయిలో తీర్చిద్దితున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . లాలపేట్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. అనంతరం శాంతి నగర్ లో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.
బస్తీ వాసులకు ఉపయోగపడే విధంగా కేంద్రం 18 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు కిషన్ రెడ్డి. 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వేస్టేషన్ ను ప్రారంభించామన్నారు.