తెలంగాణ
Seethakka: సోషల్ మీడియాను బీఆర్ఎష్ అబద్ధాలకు వాడుతుంది

Seethakka: సోషల్ మీడియాను బిఆర్ఎస్ అబద్దాలకు వాడుతుందని విమర్శలు చేశారు మంత్రి సీతక్క. సోషల్ మీడియా వల్ల తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని మంత్రి చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ గురించి సీఎం సభలో మాట్లాడటం తమకు రిలీఫ్‌గా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి మానసిక ఆవేధనకు గురి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు ఎదగడమే కష్టమని అలాంటిది తాము ఈ స్థాయికి వస్తే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం అబద్ధాలపై నే బీఆర్ఎస్ నడుస్తుందని సోషల్ మీడియా ద్వార తమపై జల్లుతున్నారని ఆమె అన్నారు.