తెలంగాణ
Secunderabad: బిర్యాని సెంటర్‌పై స్థానిక నాయకుల దాడి

Secunderabad: సికింద్రాబాద్ మారేడుపల్లిలోని బిర్యాని సెంటర్‌పై స్థానిక నాయకులు దాడికి పాల్పడ్డారు. బిర్యాని సెంటర్ బాగా నడుస్తుందని 3లక్షల రూపాయలు డిమాండ్ చేశారు స్థానిక నాయకులు. బిర్యాని సెంటర్ నడవాలంటే తమకు డబ్బులివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
అందుకు బిర్యాని సెంటర్ నిర్వాహకులు నిరాకరించడంతో మద్యం తాగొచ్చి వంటగదిపై దాడి చేశారు. వంట సామాగ్రి కిందపడేసి అనంతరం సిబ్బందిపై దాడికి యత్నించారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే పులువురిని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.