తెలంగాణ
Telangana: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానుండగా ఎల్లుం డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుంది.
అయితే బడ్జెట్ ఏరోజు ప్రవేశపెడతారనే అంశంపై స్పష్టత లేదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార-విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.