తెలంగాణ
TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

TGSRTC: RTC ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2.5శాతండి డీఏను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెలా ఆర్టీసీపై 3.6కోట్ల అదనపు భారం పడనుంది. మహిళా దినోత్సవం అంటే రేపటి నుంచి అమల్లోకి రానుంది.
అలాగే రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభించనున్నారు. తొలిదశలో 150 అద్దె బస్సులు కేటాయించ నుండగా తర్వాత 450 అంటే మొత్తం 600 బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించనున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.