AP News: అగ్నిప్రమాదం.. రూ. 50 లక్షల ఆస్తి నష్టం

AP News: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కాటవరంలో 4 పొగాకు బ్యారన్లు, 3 గడ్డి పాకలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యా యి. చిట్టూరి వరప్రసాద్, పోలిన ప్రకాశం, చిట్టూరి వీర్రాజుకు చెందిన పొగాకు బ్యారన్లలో వర్జీనియా పొగాకు క్యూరింగ్ జరుగుతుంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ బ్యారన్‌లోని గొట్టాలపై ఆకులు పడి అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నవన్నీ సులభంగా మండే స్వభావం కలిగిన పొగాకు, ములకల కర్రలు, సర్వే బాజు లు, రెల్లుగడ్డి, కర్రలు కావడంతో మంటలు వేగంగా ఎగిసిపడుతూ విస్తరించాయి.
స్థానికులు ఇళ్లలోని మోటార్లు ఆన్ చేసి నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు . అయినప్పట్టికీ ఫలితం లేకపోయింది. కోరుకొండ, ఆర్యాపురం, కొవ్వూరు నుంచి సుమా రు 10 మంది అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో 2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పొగాకు బేళ్లతో సహా అన్నీ బూడిదయ్యాయి. ఆస్తినష్టం సుమారు 50లక్షల వరకూ ఉండొచ్చని చెబుతు న్నారు. గా బ్యారన్ల వద్ద ఎలాంటి అగ్నిమాపక పరికరాలు, ఏర్పాట్లు లేకపోవడంతో వేగంగా మంటలు విస్త రించి నష్టం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.