తెలంగాణ
SLBC Tunnel:15 అడుగుల మేర బురద నీరు.. SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC Tunnel: SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీతోపాటు నేవీ సిబ్బంది ప్రమాదస్థలానికి దగ్గరలో ఉన్నట్లు సమాచారం. టన్నెల్‌లో 15 అడుగుల మేర బురద నీరు ఉండగా.. ఆ బురద నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డుగా బోరింగ్ మెషీన్ భాగాలు పడటంతో, గ్యాస్ కట్టర్లతో వాటిని రెస్క్యూ టీమ్ కట్ చేస్తోంది. అలాగే కన్వేయర్ బెల్టు పునరుద్ధరణకు ఇంజినీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు SLBC టన్నెల్ దగ్గరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.